అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ || Oneindia Telugu

2019-07-20 3

Former Delhi Chief Minister and state Congress Chief Sheila Dikshit passed away after a prolonged illness in Delhi's Fortis Escorts heart institute today. She was admitted to Escorts hospital a few days ago. She served as the chief minister of Delhi for a period of 15 years from 1998 to 2013.
#SheilaDikshit
#delhi
#farmercm
#Congress
#rahulgandi
#kerala
#uttarpradesh


కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (81) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1998 నుంచి 2013వరకు మొత్తం మూడు పర్యాయాలు వరుసగా ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా బ్రేవ్‌లేడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళ గవర్నర్‌గానూ పనిచేశారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31 జన్మించిన షీలా, న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్‌‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్, చరిత్రలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావోకు చెందిన ఐఏఎస్ అధికారి వినోద్ దీక్షిత్‌ను వివాహం చేసుకున్నారు.

Videos similaires